'అర్జున'అవార్డుకు కోహ్లీ, 'ధ్యాన్ చంద్' అవార్డుకు గవాస్కర్ల పేర్లు సిఫార్సు
ప్రతష్ఠాత్మక అర్జున అవార్డుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. 2012 కు సంబంధించి ఈ అవార్డుకు ఒక్క కోహ్లీ పేరునే బోర్డు పంపినట్లు తెలుస్తోంది. కాగా, లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ ధ్యాన్ చంద్ అవార్డు కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేరును సిఫార్సు చేసింది. అవార్డులకు నామినేషన్లు పంపేందుకు ఈనెల 30 చివరితేదీ.